జాతీయ వార్తలు

ఓటమి తర్వాత అమేథీలో రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ (యూపీ), జూలై 10: సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటమి చవి చూసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తొలి సారి ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టారు. అయితే రాహుల్ గాంధీకి ఆదరాభిమానాలు ఏ మాత్రం తగ్గలేదు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. టిలోయి అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జి మాతా ప్రసాద్ వైష్‌కు సమీప బంధువు గత నెల 25న మృతి చెందారు. ఈ మేరకు రాహుల్ గాంధీ గౌరీగంజ్‌లోని పార్టీ ఇన్‌ఛార్జీ మాతా ప్రసాద్ నివాసానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం గౌరీగంజ్‌లోని నిర్మలా దేవి విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటైన అమేథీ పార్టీ ముఖ్య నేతలు, ఆఫీసు బేరర్లు, పోలింగ్ కేంద్రాల అధ్యక్షుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిథిలోని సాలాన్, అమేథీ, గౌరీగంజ్, జగదీష్‌పూర్, తిలోయి అసెంబ్లీ సెగ్మెంట్ల పార్టీ అధ్యక్షులు కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ త్వరలో కొన్ని గ్రామాలను సందర్శించనున్నారని జిల్లా పార్టీ అధికార ప్రతినిధి అనిల్ సింగ్ తెలిపారు. రాహుల్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ప్రతినిధి చంద్రకాంత్ దూబె, జిల్లా పార్టీ అధ్యక్షుడు యోగేంద్ర మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి (కేంద్ర మంత్రి) స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ 52 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 1999 నుంచి రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినా, కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

చిత్రం... అమేథీలో బుధవారం పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ