జాతీయ వార్తలు

జంతు ప్రదర్శన శాలలో 9 జింకలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూలై 10: ప్లాస్టిక్ వినియోగం ఎంత ప్రమాదకరమో ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది. జంతు ప్రదర్శన శాలలో స్వేచ్ఛగా అటు-ఇటు పరుగెడుతూ సందర్శకులను కనువిందు చేసే తొమ్మిది జింకలు ప్లాస్టిక్ బ్యాగులను తిని మృత్యువాతపడ్డాయి. ఇది అక్షరాల జపాన్‌లోని టోక్యోలోగల జూ-పార్కులో సందర్శకుల తప్పిదమే. ఇక్కడి నారా పార్కులో వెయ్యికి పైగా జింకలు ఉన్నాయి. జూ-పార్కులోకి ప్లాస్టిక్ బ్యాగులను తీసుకుని రావద్దన్న నిబంధన కూడా ఉంది. అయినా సందర్శకులు ప్లాస్టిక్ బ్యాగులతో సందర్శించడమే కాకుండా, పార్కులోని జింకలకు, ఇతర జంతువులకు తినుబండారాలు వేస్తుంటారు. అయితే కొంత మంది సందర్శకులు ప్లాస్టిక్ బ్యాగులోని పదార్థాలాను బయటకు తీయకుండానే విసిరి వేయడం వల్ల ప్రమాదం ముంచుకుని వస్తున్నది. పదార్థాలను ప్లాస్టిక్ బ్యాగుతో విసిరి వేయడం వల్ల జింకలు ఆ బ్యాగులోని పదార్థాలను బయటకు తీసుకోలేక, బ్యాగుతో కలిపి తినడం వల్ల విషాహారంగా మారి తొమ్మిది జింకలు మృత్యువాతపడ్డాయి. జింకలు మృతి చెందడం పట్ల నారా జింకల సంరక్షణ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు బుధవారం జూ-పార్కులో ప్లాస్టిక్ బ్యాగుల ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ తినడం వల్లే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇదివరకే నిషేధించిన సంగతి తెలిసిందే.