జాతీయ వార్తలు

మరో ఇద్దరి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 10: కర్నాటకలో కాంగ్రెస్, జెడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కథ ముగిసినట్టే కనిపిస్తోంది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీనితో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. కాంగ్రెస్‌కు చెందిన గృహ నిర్మాణాల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్, ఎమ్మెల్యే కె.సుధాకర్ తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేశారు. కాగా, వీరిద్దరి రాజీనామా పత్రాలు తనకు చేరినట్టు కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ధృవీకరించారు. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇలా ఉంటే విధానసభలోని స్పీకర్ చాంబర్‌లో రాజీనామా పత్రాలు సమర్పించిన తర్వాత నాగరాజ్, సుధాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విసుగుపోయామని వ్యాఖ్యానించారు. ‘నాకు మంత్రి వర్గంలో ఎలాంటి పదవీ వద్దు. నేను ఏ హోదాను కోరుకోవడంలేదు.