జాతీయ వార్తలు

ఎమర్జెన్సీ కంటే దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 10: తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌కు వెళ్లేందుకు కర్నాటక మంత్రి డీకే శివకుమార్ చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడమేగాక, ఆ ప్రాంతంలోకి వచ్చేందుకు వీల్లేందంటూ నిషేధాజ్ఞలు విధించడాన్ని మాజీ ప్రధాని దేవెగౌడ తప్పుబట్టారు. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని విమర్శించారు. తన అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోనే కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రి శివకుమార్ ఒక గదిని బుక్ చేసుకున్నారని దేవెగౌడ తెలిపారు. అయినప్పటికీ ఆయనను హోటల్‌లోకి అనుమతించకపోవడం దారుణమని అన్నారు. కర్నాటక ప్రభుత్వాన్ని పరిరక్షించించేందుకు ప్రయత్నిస్తున్నానని, న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలనని శివకుమార్ ప్రకటించడాన్ని దేవెగౌడ గుర్తుచేశారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ముంబయిలోని ఒక హోటల్‌లో ఏడుగురు కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బస చేశారు. వీరంతా ప్రభుత్వానికి మద్దతును ఇవ్వడం లేదని ఇదివరకే ప్రకటించారు. అయితే వారితో చర్చించి ఒప్పించేందుకు శివకుమార్ ముంబయి వెళ్లినట్లు అక్కడి పోలీసులు హోటల్‌లోకి అనుమతించలేదు. కాగా, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న కర్నాటక ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు దేవెగౌడ తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. అయితే అప్పటికే సంక్షోభం ముదిరినందున ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది అనుమానంగానే ఉంది.