జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌ఐ భర్తలతో తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: కొంత మంది ఎన్‌ఆర్‌ఐ భర్తలతో భారతీయ మహిళలకు తిప్పలు తప్పడం లేదని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ. మురళీధరన్ లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. 2016 జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు 4,698 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. బుధవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి మురళీధరన్ సమాధానమిస్తూ ఈ ఫిర్యాదుల్లో రకరకాల కేసులు ఉన్నాయని, మహిళల బాధను చెప్పలేనన్నారు. వారి జీవితాలు ఎడారి కాకుండా ఉండేందుకు, ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
జాతీయ పువ్వును ప్రకటించలేదు
జాతీయ పుష్పంగా ఏ పుష్పాన్నీ ప్రకటించలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి నిత్యానంద సమాధానమిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ, ప్రకృతి మార్పుల మంత్రిత్వ శాఖ ఇదివరకే జాతీయ జంతువుగా పులిని, జాతీయ పక్షిగా నెమలిని ప్రకటించడం జరిగిందన్నారు.