జాతీయ వార్తలు

దిగ్విజయంగా అమర్‌నాథ్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూలై 10: దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో వేంచేసి అమర్‌నాథ్ ఆలయాన్ని బుధవారం 5,273 మంది యాత్రికులు దర్శించుకున్నారు. ఈ సీజన్‌లో ఇది పదో బ్యాచ్. 3,880 మీటర్ల ఎత్తయిన పవిత్ర గుహ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. జూన్ 30న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కాగా భగవతీనగర్ బేస్ నుంచి ఇప్పటికి 47,546 మంది యాత్రికులు తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం నాటికి లక్షా, 21వేల, 196 మంది యాత్రికులు దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. జంట మార్గాలైన పహల్‌గావ్, బల్టాల్‌లో 46 రోజుల పాటు యాత్ర సాగుతుంది. మంచుతో సహజసిద్ధంగా ఏర్పడ్డ శివలింగం చూసి తరిస్తారు. ఆగస్టు 15తో యాత్ర ముగుస్తుంది. పదో బ్యాచ్‌లో 26 మంది చిన్నారులున్నారు. 226 వాహనాల్లో తరలివచ్చిన యాత్రికుల కన్వాయ్‌కు భారీ భద్రత కల్పించారు. పహల్‌గావ్, బల్టాల్ బేస్ క్యాంప్‌కు చేరుకుంటారు.