జాతీయ వార్తలు

అందరి ఆరోగ్యమే ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: అపరిమితంగా పెరిగిపోతున్న దేశ జనాభాను స్థిరీకరించేందుకు ఏడాదికో నెలను అంకితం చేయాలని ఎన్జీఓ సంస్థలకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. విశ్వజనీన ఆరోగ్య కల్పనా లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు జీవన నాణ్యతను పెంపొందించడానికి ఇది అవసరమని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ‘నివారణ యోగ్యమైన వ్యాధుల కారణంగా గర్భిణీలు గానీ, పిల్లలు గానీ ఇంక ఎంత మాత్రం ప్రాణాలు కోల్పోకుండా సంయుక్తంగా కృషి చేద్దాం’ అని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. అయితే ఈ బృహత్ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నా రు. భాగస్వామ్య సంస్థలు, పౌర సమాజం, ప్రైవేటు కార్పొరేటు రంగం, కమ్యూనిటీ నాయకులు, మీడియా కలసికట్టుగా పనిచేసి అత్యంత కీలకమైన తమ బాధ్యతను నెరవేర్చాలన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలపైన ప్రభు త్వం దష్టి పెట్టిందని, జీవన నాణ్యతను పెంపొందించడంతో పాటు, అందరికీ మెరుగైన ఆరోగ్యం సేవలను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఈ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటే జనాభా స్థిరీకరణ అనేది అత్యంత కీలకమని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ విధానాల్లో ఆరోగ్యానికి కీలక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. లింగ సమానత మాతృ, శిశు ఆరోగ్యం, మానవ హక్కులు, పేదరికం ఇతర సంబంధిత అంశాలపైన లోతుగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ అవకాశం వేదిక అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పోలియో నివారణలో సాధించిన విజయాన్ని వెల్లడించిన ఆయన పౌర సమాజానికి పూర్తి స్థాయిలో క్రియాశీలక ప్రమేయాన్ని కల్పించినప్పుడే ఏ లక్ష్యమైనా సాధ్యమవుతుందన్న విషయం పోలియో నివారణ ద్వారా ప్రభుత్వానికి స్పష్టమైందన్నారు. ఇప్పటి వరకు ఎన్నో విజయాలను సాధించిన తాము సవాళ్లనుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామన్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి నిర్దేశిత లక్ష్యం దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఆరోగ్యశాఖకు ప్రభుత్వం భారీగా నిధులను పెంచడాన్ని బట్టి చూస్తే ఈ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతుందన్నారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి సరికొత్త చైతన్య కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విస్తరించడం ద్వారా ప్రజల్లో జనాభాపై అవగాహన కలిగించాలన్నారు.

చిత్రం...కేంద్ర మంత్రి హర్షవర్దన్