జాతీయ వార్తలు

బాహుబలి (జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌దేశ కీర్తి పతాకను రోదసీలో మరింత సమున్నతంగా ఎగురవేయడానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. చంద్రయాన్-1 విజయం అందించిన స్ఫూర్తితో మరోసారి చంద్రుడిపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులను శోధించేందుకు, ఇతరత్రా ఎన్నో వివరాలను మానవాళికి అందించేందుకు ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం జీఎస్‌ఎల్వీ ఎంకే-3 (బాహుబలి) అన్ని హంగులతో ముస్తాబవుతోంది. ఈనెల 15న ప్రయోగించనున్న చంద్రయాన్-2కు సంబంధించిన కీలక భాగాల ఛాయాచిత్రాలను ఇస్రో గురువారం విడుదల చేసింది. చంద్రుడిపైకి రోవర్‌ను పంపాలన్న లక్ష్యసాధనకు ఇస్రో మరింత ఉత్సాహంగా సమాయత్తమవుతోంది.