జాతీయ వార్తలు

త్వరలోనే కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. అంతవరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తాత్కాలికంగా నిర్వహించాలన్న సీనియర్ నాయకుల విజ్ఞప్తిని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తిరస్కరించటంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మరింత జఠిలంగా మారింది. కొత్త అధ్యక్షుడిని నియమించుకోకపోతే జిల్లా స్థాయిలో కాంగ్రెస్ కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నదని సీనియర్ నాయకులు చెబుతున్నారు. వారం, పది రోజుల్లో కొత్త అధ్యక్షుడిని నియమించుకునేందుకు సీనియర్ నాయకులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగేంతవరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగానైనా నిర్వహించాలని సీనియర్ నాయకులు ఇటీవల సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరటం లేదని వారు సోనియా గాంధీ దృష్టికి తెచ్చారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు సహాయపడాలి లేదా ఎంపిక చేసేంత వరకు తాత్కాలికంగానైనా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలని సోనియా గాంధీకి వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనను సోనియా తిరస్కరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యం మూలంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా కూడా తనకు సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారని అంటున్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు బుధవారం రాత్రి మరోసారి సమావేశమై కొత్త అధ్యక్ష పదవికి నాలుగైదు పేర్లు పరిశీలించారని అంటున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, మహారాష్ట్ర సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ షిండే, మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా తదితరుల పేర్లు పరిశీలించారని అంటున్నారు. వారం, పది రోజుల్లో కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని నియమించే దిశగా చర్చలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. కర్నాటక, గోవాలో పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేసి బీజేపీలో చేరడం వంటి సంఘటనలు సీనియర్ నాయకులను ఆందోళనలో పడవేసింది. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపికలో ఇకమీదట ఏమాత్రం జాప్యం జరిగినా దీని ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడుతుందని వారు భయపడుతున్నారు. బీజేపీ అధినాయకత్వం కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం మధ్యప్రదేశ్‌పై దృష్టి సారించనున్నది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బీజేపీకి మధ్య కేవలం ఐదుగురు శాసనసభ్యుల తేడా మాత్రమే ఉండడం తెలిసిందే. ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వివిధ రాష్ట్రాల్లో పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందన్నది వారి భయం. అందుకే వారం, పది రోజుల్లో కొత్త అధ్యక్షుడిని నియమించుచునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. కొత్త అధ్యక్షుడి పేరుపై సీనియర్ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తరువాతనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని సీనియర్ నాయకులు నిర్ణయించుకున్నారు.