జాతీయ వార్తలు

నాకెలాంటి సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 11: కర్నాటక రాజకీయ సంక్షోభానికి తాను ఏ విధంగానూ బాధ్యుడిని కాననీ.. అలాగే, దాని పర్యావసానంతోనూ తనకు ఎలాంటి సంబంధం ఉండదని అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ ప్రకటించారు. కర్నాటకలోని అధికార సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16మంది ఎమ్మెల్యేల రాజీనామాలు స్వచ్ఛందంగా చేసినవా? నిజమైనవా? అన్న అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతే వాటిపై నిర్ణయం తీసుకొంటానని స్పీకర్ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. కర్నాటక శాసనసభ నియమ నిబంధనల ప్రకారం రాజీనామాలన్నీ లోపరహితమైన ఫార్మాట్‌లో ఉండి తీరాలని ఆయన తేల్చి చెప్పారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, వీటిలో ఎనిమిది రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో లేవని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామాలన్నీ సరైన ఫార్మాట్‌లోనే ఉన్నాయని పేర్కొన్న ఆయన, అవి స్వచ్ఛందమా.. నిజమైనవా? అన్న అంశాన్ని పరిశీలిస్తానని వెల్లడించారు. అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని శాసనసభ్యులు నిజంగా భావిస్తే వారి రాజీనామా లేఖలు నిర్ణీత ఫార్మాట్‌లోనే ఉండాలని అన్నారు. ఇదే విషయాన్ని అసమ్మతి ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో వారికి స్పష్టం చేశానన్నారు. గురువారం ఉదయం నుంచి చకచకా సాగిన కర్నాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో జోక్యం చేసుకొన్న సుప్రీంకోర్టు.. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలని.. వారితో సాయంత్రం ఆరు గంటలకు సమావేశం కావాలని స్పీకర్‌కు స్పష్టం చేసింది. ఈ రాజీనామాలపై తన నిర్ణయాన్ని స్పీకర్.. శుక్రవారానికల్లా తమకు తెలియజేయాలని.. ఆ తరువాతే ఈ అంశాన్ని మళ్లీ విచారణకు చేపడతానని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న కర్నాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్