జాతీయ వార్తలు

నిరాశకు గురిచేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యసభలో గురువారం కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ చాలా ఆశలు పెట్టుకుందని.. అయితే ఎటువంటి కేటాయింపులు జరపకుండా తీవ్రనిరాశకు గురి చేసిందని అన్నారు. విభజన చట్టంలోని హామీలను ఈ బడ్జెట్‌లో నెరవేర్చే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవిన్యూ లోటుతో రాష్ట్రం ఇబ్బందిపడుతున్నా ఎటువంటి ప్రస్తావనా లేదని వేమిరెడ్డి పేర్కొన్నారు.
ఏపీకి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం
పోలవరం నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ ఒక్కపైసా కూడా కేటాయించకపోవడంపై తెలుగుదేశం రాజ్యసభ పక్ష నాయకుడు కనకమేడల రవీంద్రకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో కనకమేడల పాల్గొన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే విధంగా వైఎస్సార్‌సీపీ బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే ఏపీ అభివృద్దికి అన్ని విధాలుగా కేంద్రం కృషి చేయాలని కనకమేడల డిమాండ్ చేశారు.