జాతీయ వార్తలు

నేనెందుకు రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటక సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. 16మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. తానెందుకు పదవి నుంచి వైదొలగాలని కుమారస్వామి ప్రశ్నించారు. గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో సీఎం కుమారస్వామి మాట్లాడుతూ ‘సీఎం పదవికి నేనెందుకు రాజీనామా చేయాలి.. ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందని’ ప్రశ్నించారు. కర్నాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతోందంటూ వస్తున్న కథనాల నేపథ్యంలో కుమారస్వామి పై విధంగా ప్రశ్నించారు. 2009-10 సంవత్సరంలో 18మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంక్షోభంలో పడిపోయిన సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని నాటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయలేదన్న సంఘటనను ఈ సందర్భంగా కుమారస్వామి గుర్తు చేశారు.