జాతీయ వార్తలు

ఏపీకి ‘హోదా’ ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా శుక్రవారం మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇది సాధ్యం కాని పక్షంలో హోదా మూలంగా వచ్చే అన్ని రకాల ప్రయోజనాలను రాష్ట్రానికి కల్పించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఐదు సంవత్సరాల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ అన్నారని కేవీపీ స్పష్టం చేశారు. ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు అప్పటి కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం ఆమోదించిందని, అయినా కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదా హోదా మూలంగా కలిగే ప్రయోజనాలను కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ప్రకారం ఏపీకి వివిధ కేంద్ర పథకాలకు 90 శాతం నిధులను భరించాలి, విదేశీ సహాయ పథకాలకు 90 శాతం నిధులను గ్రాంటుగా ఇవ్వాలి, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పన్ను రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ ప్రకటన చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల ఒనగూరే ప్రయోజనాలను కలుగజేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.