జాతీయ వార్తలు

‘చట్టం ముసాయిదా’కు ఉప సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలో వైద్యులు, ఇతర వైద్య నిపుణులపై హింసను నిరోధించేందుకు ఒక చట్టం తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ చట్టం ముసాయిదాను తయారు చేసే బాధ్యతను ఎనిమిది మంది సభ్యుల సబ్ కమిటీకి అప్పగించింది. తమపై దాడులను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకు రావాలని వైద్య సిబ్బంది చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం ముసాయిదాను జూలై 17లోగా రూపొందించాలని సబ్ కమిటీకి నిర్దేశించినట్టు అధికారులు తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఎయిమ్స్ ఆర్‌డీఏలకు చెందిన ప్రతినిధులు ఈ ఉప సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ చట్టం ముసాయిదాను తయారు చేయడంలో సబ్ కమిటీకి సహకరించేందుకు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) నుంచి ఒక అనుభవం గల వ్యక్తిని నామినేట్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వైద్యులపై దాడులను నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలను పరిశీలించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలుత పది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.