జాతీయ వార్తలు

విశాఖలో పట్టాలు తప్పిన ఇంజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 13: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో షంటింగ్ ఇంజన్ శనివారం పట్టాలు తప్పింది. దీంతో ఎక్కడి రైళ్ళు అక్కడే నిలిచిపోయాయి. దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు స్టేషన్‌లో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సత్వరమే పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ సంఘటనతో నాలుగు పాసింజర్ రైళ్ళు రద్దయ్యాయి. విశాఖపట్నం నుంచి బ్రహ్మపూర్, రాయగడ, దుర్గ్, పలాస ప్రాంతాలకు వెళ్ళాల్సిన పాసింజర్లను రద్దు చేసినట్టు వాల్తేర్ డివిజన్ అధికారులు ప్రకటించారు. దీంతోపాటు తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్‌లు విశాఖ రైల్వే స్టేషన్ ఔటర్‌లో నిలిచిపోగా, స్టేషన్ నుంచి వెళ్ళాల్సిన మరి కొన్నింటికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు విశాఖ స్టేషన్‌లో చిక్కుకుపోయారు.

చిత్రం... విశాఖ రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన ఇంజన్‌కు మరమ్మతులు చేపడుతున్న సిబ్బంది