జాతీయ వార్తలు

ఈసారి 65 సీట్లు దాటేస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, జూలై 14: త్వరలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 65 సీట్లకు పైగా గెలుచుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పని చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువీర్ దాస్ తెలిపారు. అత్యంత సంక్లిష్ట రాజకీయ వాతావరణం కలిగిన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరి కొన్ని రోజుల్లో ఐదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న ఆయన పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘అబ్‌కీ బార్ 65 పార్’ (ఈ దఫా 65 దాటాలి) లక్ష్యంగా తమ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆ లక్ష్యాన్ని సునాయసంగా అధికమిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 లోక్‌సభ సీట్లలో 12 సీట్లను తమ పార్టీ కైవసం చేసుకుందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో జెఎంఎం తదితర పార్టీలు మహాఘట్ బంధన్‌గా ఏర్పడినా, కాంగ్రె స్-జెఎంఎం పార్టీలో చేరో స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగాయని ఆయన తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాక ముందు అట్టడుగున ఉన్న ప్రజలు, దళితులు అన్ని విధాలా అన్యాయాలకు గురయ్యారని, రాష్ట్రంలో ప్రగతి నిలిచిపోయిందని ఆయన విమర్శించారు. తమ ప్రతి కార్యకర్త ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. మంచి మెజారిటీతో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. 2014లో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మొత్తం 81 సీట్లు కాగా బీజేపీ కేవలం 42 సీట్లను కైవసం చేసుకుందన్నారు. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 65 అసెంబ్లీ స్థానాలను దాటాలన్న లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగనున్నదని ఆయన చెప్పారు. తాము చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే తిరిగి తమ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో దేశ ప్రజలు సుఖ శాంతులతో ఉన్నారని అన్నా రు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాబోయే రోజుల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి దాస్ తెలిపారు.