జాతీయ వార్తలు

‘సృజనకు ఆలంబన గ్రంథాలయాలే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, విశిష్ట ఆలోచనా విధానాన్ని, పరిశోధనా దృక్పథాన్ని పాదుకొల్పేలా పాఠశాల గ్రంథాలయాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పురస్కారం ఏర్పాటైంది. ‘బంధనా సేన్’ పేరిట ఈ ప్రత్యేక అవార్డులను ఏర్పాటు చేసి లైబ్రేరియన్లకు, పాఠశాలల అధినేతలకు ఇవ్వనున్నా రు. ‘ఒన్ ఆప్ లైబ్రరీ, బుక్‌స్టడీ అండ్ లెర్నింగ్ ల్యాబ్’ ద్వారా ఈ అవార్డును బంధనాసేన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. పిల్లల గ్రంథాలయాలు, అధ్యయన (రీడింగ్) కేంద్రాలను దేశ వ్యాప్తంగా నిర్వహించి బంధనాసేన్ కీర్తిగడించారు. కాగా ఈ పురస్కారం కోసం ఎంట్రీలను జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు స్వీకరిస్తారు. ‘ఒన్ అప్: లైబ్రరీ, బుక్‌స్టూడియో, లెర్నింగ్ ల్యాబ్’ను నిర్వహిస్తున్న దల్బీర్ కౌర్ మదన్ ప్రోద్బలంతో ఈ అవార్డు ఏర్పాటైంది. గ్రంథాలయాలను ప్రస్తుత సంప్రదాయ పద్ధతుల నుంచి 21వ శతాబ్ధపు విద్యార్థుల విజ్ఞాన విస్తరణకు కీలకంగా వ్యవహరించేలా మళ్లించాలన్న దృక్పథంతో దల్బీర్ కౌర్ మదన్ తన ఔ త్సాహిక సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. కాగా ఈ అవార్డుకు ఎంపిక చేసేందుకు ఆరుగురు సభ్యులతో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. అ లాగే ఓ సలహా కమిటీని ప్రముఖులతో ఏర్పా టు చేశారు. ఇలా ఉండగా ఎంపికైన వారికి నవంబర్ 9న అవార్డులను పంపిణీ చేస్తారు.