జాతీయ వార్తలు

ఎన్‌సీడీ క్లినిక్‌లు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 14: సమాజంలో మారుతున్న జీవన ప్రమాణాలు ఆందోళనకరంగా మారుతున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జీవనశైలిలో చోటుచేసుకొంటున్న మార్పులతో అంటువ్యాధులు కాని రోగాలు (ఎన్‌సీడీ) సంక్రమిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వీటి నివారణకు ఎన్‌సీడి క్లీనిక్‌ల ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం చాలా ఉందని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. వీటి నివారణకు ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉందని ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలో ఆదివారం ఎంజీఎం ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాల్లో మాత్రు, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామన్నారు. మారుతున్న జీవన ప్రమాణాల కారణంగా శారీరక శ్రమ లేకపోవడంతో అంటువ్యాధులు కాని రోగాల బారిన అనేకమంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలు.. ముఖ్యంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని.. ఇందుకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కీలకపాత్ర పోషించాలని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఎన్‌సీడీ క్లీనిక్‌ల ద్వారా అంటువ్యాధులు కాని ఎన్నో రోగాలను అరికట్టవచ్చని ఆయన సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు నెలకొల్పే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ మాట్లాడుతూ వైద్యరంగంలో వస్తున్న అనూహ్య మార్పులు చోటు చేసుకొంటున్నాయని అన్నారు. సుశ్రుత, జీవక కుమారభక్క, చరక వంటి వంటి వైద్యాలతో అనేక రోగాలను నయం చేయవచ్చని అన్నారు. ఇంగ్లాండ్‌తో సమానంగా భారత్‌లో సైతం అత్యాధునిక ప్రమాణాలతో శస్తచ్రికిత్సలు చేయడంలో వైద్యులు కీలకపాత్ర పోషిస్తున్నారని భన్వారిలాల్ పేర్కొన్నారు.
చిత్రం...చెన్నైలో ఆదివారం ఎంజీఎం హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు