జాతీయ వార్తలు

కర్నాటక సంక్షోభం కాంగ్రెస్ అంతర్గతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, జూలై 14: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం కర్నాటక రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణమని బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు ఏపీ నడ్డా అన్నారు. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సరికొత్త రాజకీయ సంస్కృతి ఆవిష్కృతమవుతోందని ఆదివారంనాడు ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో నడ్డా అన్నారు. ఓటుబ్యాంకు, అనువంశిక రాజకీయాలను వ్యతిరేకిస్తున్న వారందరికీ బీజేపీ ఆహ్వానం పలుకుతోందని స్పష్టం చేసిన ఆయన తమ పార్టీని అంతటా విస్తరిస్తున్న పార్టీగా అభివర్ణించారు. కర్నాటకలోని అధికార కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి నుంచి 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అక్కడ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ సంక్షోభానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై నడ్డా స్పందించారు. ఆ ఆరోపణలన్నీ నిరాధారమని, కర్నాటక వ్యవహారం పూర్తిగా కాంగ్రెస్ అంతర్గతమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు కూడా ఒక పరంపరగా తమ పదవులను త్యజిస్తున్న విషయాన్ని నడ్డా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ రహిత భారతదేశ నిర్మాణం అంటే కాంగ్రెస్ సంస్కృతికి చరమగీతం పాడడమేనని ఆయన వివరించారు. ముఖ్యంగా అవినీతి, స్వార్థపూరిత రాజకీయాలను వదిలించాలన్నదే తమ ఆశయమని అన్నారు. మోదీ సారథ్యంలో ఆవిష్కృతమైన సరికొత్త రాజకీయ సంస్కృతి పట్ల ప్రతిఒక్కరిలోనూ ఆశక్తి పెరుగుతోందని, మద్దతూ విస్తృతమవుతోందని తెలిపారు. ఓటుబ్యాంకు, అనువంశిక రాజకీయాలను తిరస్కరించిన ప్రజలు అభివృద్ధి రాజకీయాలకే పట్టం కడుతున్నారని నడ్డా అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త సంస్కృతిని కోరుకున్న అందరికీ దేశమంతా విస్తరిస్తున్న బీజేపీ ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల చోటుచేసుకుంటున్న సామూహిక హత్య సంఘటనలపై మాట్లాడిన ఆయన చట్టాన్ని తమ చేతిలో తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా అందుకు పాల్పడ్డవారిపై ఆయా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయని ఆయన తెలిపారు.
చిత్రం...జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మొక్కలు నాటుతున్న బీజేపీ తాత్కాలిక
అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువీర్ దాస్.