జాతీయ వార్తలు

రైళ్లపై కార్గిల్ విజయోత్సవ హేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: కార్గిల్ యుద్ధానికి ప్రతీకగా నిలిచేలా 10 రైళ్ళను యుద్ధానికి సంబంధించిన దృశ్యాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ అధికారి ప్రతినిధి తెలిపారు. ఈ రైళ్లను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. 20 ఏళ్ళ క్రితం కార్గిల్ యుద్ధంతో సాధించిన విజయం, అమరులైన సైనికుల త్యాగాల గురించి దేశ ప్రజలకు మరోసారి గుర్తు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళను ఇందుకు ఎంపిక చేశామని, ఇందులో ప్రయాణించే ప్రయాణికులు కార్గిల్ యుద్ధం, దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాల గురించి తెలియజేసేలా దృశ్యమాలిక ఉంటుందన్నారు. సోమవారం ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరే కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర వైద్య మంత్రి హర్షవర్దన్ జెండా ఊపి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అన్‌గాది, యుద్ధంలో మరణించిన వీర జవాన్ల కుటుంబ సభ్యులు పాల్గొంటారని ఆయన చెప్పారు.