జాతీయ వార్తలు

రాజీ లేదన్న రెబల్స్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 14: కర్నాటకలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలను కాంగ్రెస్-జెడీ(ఎస్) కూటమి నేతలు ఆదివారం మరింత ముమ్మరం చేశారు. ఢిల్లీలో మకాం పెట్టిన ఎంటీబీ నాగరాజు సహా రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పడంతో కుమారస్వామి సర్కారు భవిత మరింత సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ కూడా ఎలాగైనా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉన్న సంకీర్ణ సర్కారు నేతలు అందివచ్చిన అన్ని మార్గాల్లోనూ ముందుకు వెళుతున్నారు. రెబెల్ నాయకులను వెనక్కి తీసుకుని వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రెబెల్ ఎమ్మెల్యే నాగరాజును వెనక్కి తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదివారం ముంబయి వెళ్ళిన ఆయన అక్కడ మకాం వేసిన ఇతర ఎమ్మెల్యేలతో చేరిపోయారు. ముంబయి నుంచి మీడియాతో మాట్లాడిన నాగరాజు తన రాజీనామా విషయంలో రాజీ పడేది లేదని వెల్లడించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి సంసిద్ధమైన నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ తాజా పరిణామాలు సర్వత్రా మరింత ఉత్కంఠను రేకెత్తించింది. ఎప్పుడైతే నాగరాజు ముంబయి విమానం ఎక్కాడో ముఖ్యమంత్రి కుమారస్వామి తన తండ్రి దేవెగౌడ ఇంటికి వెళ్ళి తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు. మరోపక్క సంకీర్ణ సర్కారులో భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్ నేతలు కూడా ఒక హోటల్‌లో మకాం వేసి తదుపరి వ్యూహానికి పదును పెడుతున్నారు. మరోపక్క సీఎల్‌పీ నేత సిద్దరామయ్య సోమవారం ఉదయం శాసనసభాపక్ష సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు. ఆదివారం ఇటు జెడీ(ఎస్)లోనూ, అటు కాంగ్రెస్‌లోనూ విడివిడిగాను, ఉమ్మడిగాను విస్తృత మంతనాలు జరిగాయి. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించుకోవడం తప్ప సంకీర్ణ ప్రభుత్వానికి మరో మార్గమే లేని పరిస్థితి ఏర్పడింది.