జాతీయ వార్తలు

‘అయోధ్య’పై ఆర్డినెన్స్‌కు యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: అయోధ్యలోని బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి కూల్చివేతకు రెండేళ్ల ముందే కాంగ్రెస్ ప్రోత్సాహంతో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించిందని మాజీ ప్రధానిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్నారు. ‘చంద్రశేఖర్ సైద్ధాంతిక రాజకీయాలకు ఆఖరి చిహ్నం’ పేరిట రాసిన ఆ పుస్తకంలో 1990లో మాజీ ప్రధాని చంద్రశేఖర్‌తోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, బైరాన్ సింగ్ షెకావత్ సమస్యాత్మక బాబ్రీ మసీదు అంశంపై ఇటు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), అటు ముస్లిం నాయకుల మధ్య మధ్యవర్తిత్వం నెరిపారని పేర్కొన్నారు.
జయప్రకాష్ నారాయణ్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ జర్నలిస్ట్ రామ్ బహదూర్ రాయ్ గురించి ప్రస్తావిస్తూ చంద్రశేఖర్ ప్రభుత్వం బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ‘అయోధ్య వివాదం పరిష్కారానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు సన్నద్ధతమవుతున్న సమాచారంతో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ, అతని కోటరీలోని సలహాదారులు భయపడ్డారు. ఎందుకంటే అంతటి సంక్లిష్ట సమస్య ఆర్డినెన్స్‌తోనే చంద్రశేఖర్‌కు దక్కాలని వారు కోరుకోలేదు’ అని ఆ పుస్తకంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్కొన్నారు.
అదేవిధంగా అప్పట్లో వీహెచ్‌పీ, ముస్లింల మధ్య నెలకొన్న తలెత్తే సంఘర్షణలను అణచివేసేందుకు సైతం కేంద్రంలోని చంద్రశేఖర్ ప్రభుత్వం వెనుకాడలేదని ఆయన తన పుస్తకంలో తెలిపారు.