జాతీయ వార్తలు

అవన్నీ నా ఆలోచన లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన పథకాలైన నేషనల్ హైవే డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డీపీ), ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) తన ఆలోచనల నుంచి ఉద్భవించినవేనని, అయితే వాటిని కొంతమంది తమ సొంతం చేసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. గత ఏడాది బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హా తొలుత దౌత్యవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో 1998 నుంచి 2004 వరకు కేంద్ర ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1990-91 సంవత్సరాల్లో పరిమిత కాలంపాటు ప్రధానిగా పనిచేసిన చంద్రశేఖర్ మంత్రివర్గంలోనూ యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ‘నేషనల్ హైవే ప్రాజెక్టు పూర్తిగా నా ఆలోచన నుంచి వచ్చినదే. నా విషయానికొస్తే ఎన్‌హెచ్‌డీపీ అన్నది కొత్త ఆలోచనేమీ కాదు. 1970లో జర్మనీలో పోస్టింగ్ వచ్చినప్పటి నుంచి దీనిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. ఫెడరల్ కంట్రోల్ యాక్సెస్ హైవే సిస్టమ్ (ఆటోబహన్స్) జర్మనీలో ఎంతో పేరుంది’ అని సిన్హా ‘కనికరంలేని’ పేరిట ఇటీవల రాసిన తన స్వీయచరిత్రలో పేర్కొన్నారు. అక్కడి నుంచి తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత జర్మనీలో తాను చూసిన ఫెడరల్ కంట్రోల్ యాక్సెస్ హైవే సిస్టమ్ వంటి విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలని యోచించాను’ అని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. మన దేశంలో 1998 ఎన్‌హెచ్‌డీపీని ప్రారంభించినా దాని పరిధిని విస్తృతం చేసేందుకు, పునరావాసం, ప్రధాన హైవేల విస్తరణ వంటి మరింత పకడ్బందీగా చేపట్టాలని తాను ఆలోచన చేశానని ఆయన అన్నారు. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు గల ఉత్తర-దక్షిణ కారిడార్, పోర్‌బందర్ నుంచి సిల్‌చార్ వరకు తూర్పు-పశ్చిమ కారిడార్‌లను అనుసంధానించేందుకు ఆలోచన చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఏడాది బీజేపీని వీడిన యశ్వంత్ సిన్హా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కూడా తన ఆలోచనలో భాగమేనని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కొత్త పథకాలను ప్రారంభించడంతోపాటు అందుకు అనుగుణంగా ప్రత్యేక నిధులు మంజూరు చేయడం వంటి అంశాలను అప్పటి ప్రధాని వాజపేయికి సలహా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజపేయి సడక్ యోజనను కూడా తాను సూచించడంతో అందుకు వాజపేయి తన అలోచనలతో ఏకీభవించినా తన తర్వాత తన పేరిట ఆ పథకం ఉండడాన్ని తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు.