జాతీయ వార్తలు

మామ పైకి తిరంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 14: అంతరిక్ష ప్రయోగ రంగంలో భారత్‌కు ఉన్న కీర్తి ప్రతిష్టల్ని, స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత ఇనుమడింపజేసే రీతిలో షార్ వేదికగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో శాస్తవ్రేత్తలు చేపట్టారు. సోమవారం చంద్రయాన్-2 మిషన్ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఇస్రో శాస్తవ్రేత్తలు కేవలం రెండు నెలల వ్యవధిలోనే జాబిలి వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం తెల్లవారుజామున 2:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 6:51 గంటలకు ప్రారంభమై 20 గంటలు కొనసాగినంతరం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-2 మిషన్ నింగి వైపు పయనించింది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ శనివారమే షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని మూడో దశలో ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్తవ్రేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. ఇంధనాన్ని నింపి రాకెట్‌లోని వివిధ వ్యవస్థల పనితీరును గమనించినంతరం అక్సిజన్, హీలియం గ్యాస్ నింపే ప్రక్రియ పూర్తిచేశారు. చందమామ రూపురేఖా విలాసాలు తెలుసుకునే క్రమంలో ఇస్రో జాబిలమ్మ-2 యాత్ర చేపట్టింది. ఇప్పటికే చంద్రయాన్-1 2008లో విజయవంతంగా ప్రయోగించి కొంత సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం షార్‌కు విచ్చేశారు. రాష్ట్రపతి రెండో ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న చంద్రయాన్-2 మిషన్‌తో పాటు రెండో వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌ను సందర్శించారు. రాష్ట్రపతికి ఇస్రో చైర్మన్, శాస్తవ్రేత్తలు ప్రయోగ వివరాలు తదితర అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3 రాకెట్ నింగిలోకి ఎగిరినంతరం కేవలం 16.3 నిమిషాల్లో 181.6 కిమీ ఎత్తుకు చేరాక చంద్రయాన్-2 మిషన్‌ను కక్ష్యలోకి చేర్చి విడిపోతుంది. దీంతో ప్రయోగ తొలి దశ పూర్తవుతుంది. చంద్రయాన్-2 మిషన్‌లో అర్బిటర్, ల్యాండర్, రోవర్ అత్యంత కీలకమైన మూడు పరికాలు అమర్చి ఉన్నారు. వీటిలో అర్బిటర్ చంద్రుని చుట్టూ తిరగుతూ సమచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రుడిపై దిగుతుంది. ల్యాండర్‌లో ఉండే రోవర్ చంద్రుడి ఉపరితలం దక్షిణ ద్రువం వద్దకు చేరుకొని నీటి ఆనవాళ్లను పరిశోధిస్తుంది. రాకెట్ నుంచి విడిపోయిన కాంపోజిట్ మాడ్యూల్‌ను
17 రోజులపాటు రోదసీలో పయనింప చేసి చంద్రుడి సమీపంలోకి చేరుస్తారు. ఇలా లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలో 6 రోజులపాటు అంటే 22వ రోజు వరకు చంద్రయాన్-2 పేలోడ్ సంచరిస్తూ ఉంటుంది. 22వ రోజు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2ను శాస్తవ్రేత్తలు చేరుస్తారు. 22వ రోజు నుంచి 49వ రోజు వరకు అంటే 28 రోజుల పాటు దీర్ఘవృత్తాకారంలో ఉండే ఈ కక్ష్యలో లూనార్ బౌండ్ పేస్ చంద్రయాన్-2 పరిభ్రమిస్తూ ఉంటుంది. 50వ రోజు శాస్తవ్రేత్తలు అడాప్టర్ నుంచి అర్బిటర్ వేరుపడేలా చేస్తారు. ఈ అర్బిటర్‌లోని అపోజి మోటారును మండించి చంద్రుడికి 100 కిమీ ఎత్తులో వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. 54వ రోజు చంద్రుడి దక్షిణ ద్రువం పైకి అర్బిటర్ నుంచి ల్యాండర్‌ను దించుతారు. ల్యాండర్ దిగిన తరువాత అందులో ఉన్న రోవర్ వెలుపలకు వస్తుంది. ఇది 500 మీటర్ల పరిధిలో పయనిస్తూ చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 39,059 కిమీ నుంచి 1,41,000 కిమీ పెంచేందుకు అర్బిటర్‌ను మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి అర్బిటర్ చంద్రుడి వైపు మళ్లిస్తారు. అనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రోబర్న్ చేసి వంద కిమీ వృత్తాకార కక్ష్య తగ్గించడానికి నాలుగుసార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కిమీ ఎత్తు నుంచి 30 కిమీ ఎత్తుకు తగ్గించుకుంటూ అర్బిటర్‌ను మండిస్తారు. తరువాత అర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలం పైన దక్షిణ ద్రువ ప్రాంతంలోని మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగుతుంది. ఆ తరువాత ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఇది సెకండ్‌కు ఒక సెంటీమీటరు వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) అనగా 14 రోజులు పనిచేస్తుంది. 14 రోజులు 500 మీటర్ల దూరం పయనించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇదంతా జరగడానికి 52 రోజులు పడుతుంది. ఇలా 3.50 లక్షల కిమీ దూరం ప్రయాణించి సెప్టెంబర్ 6న అర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు చేరుకొని పరిశోధనలు ప్రారంభించనుంది. చంద్రయాన్-1 ప్రయోగంలో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించి చంద్రుని చుట్టూ తిప్పి నీటి జాడలున్నాయని కనుగొన్నది మన శాస్తవ్రేత్తలే. ఈసారి అర్బిటర్ ద్వారా ల్యాండర్, రోవర్‌ను పంపించడమే కాకుండా 14 రకాల పేలోడ్స్‌ను పంపించి చంద్రుడి మూలాలను పరిశోధించడానికి ఇస్రో కసరత్తు చేస్తోంది.
రాకెట్ పయనం ఇలా..
జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3- ఎం 1 రాకెట్ 43.3 మీటర్ల పొడవు కలిగి 640 టన్నుల బరువు ఉంటుంది. ఈ రాకెట్‌లో 3,850 కిలోల బరువు కలిగిన చంద్రయాన్-2 మిషన్, చంద్రయాన్-2 మిషన్‌లో 3 టన్నుల బరువు కలిగిన అర్బిటర్ 1.4 టన్నుల బరువు కలిగిన ల్యాండర్, 27 కిలోల బరువు కలిగిన రోవర్ ఉంటుంది. ఇందులో 14 ఇండియన్ పేలోడ్స్ ఉపకరణాలతో పాటు అమెరికాకు చెందిన 2, యూరప్ దేశాలకు సంబంధించిన రెండు పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. మొదటి దశలో రాకెట్ ఇరువైపులా ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్-200 బూస్టర్ల సాయంతో నింగికి పయనమవుతుంది. ఈ దశలో రెండు స్ట్ఫ్రాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 131.30 సెకన్లలో మొదటి దశ పూర్తవుతుంది. అక్కడ నుంచి రెండో దశ ద్రవ ఇంజన్ మోటార్లతో 110.82 సెకన్లకు ప్రారంభమవుతుంది. 203 సెకన్లకు రాకెట్ శిఖ భాగాన చంద్రయాన్-2కు అమర్చిన ఉష్ణకవచం విడిపోతుంది. ఈ దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 308.50 సెకన్లకు రెండో దశ పూర్తవుతుంది. అత్యంత కీలకమైన మూడో దశ క్రయోజనిక్ సీ-25 మోటార్లు 310.90 సెకన్లకు ప్రారంభమై 958.71 సెకన్లకు తన మూడు దశలను పూర్తిచేసుకొని రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విడిచిపెడుతుంది. అనంతరం రాకెట్ శిఖర భాగాన అమర్చిన చంద్రయాన్-2 మిషన్ 978.70 సెకన్లకు 16.21 నిమిషాల్లో భూమికి దగ్గరగా 170.06 కిలోమీటర్లు, భూమికి దూరంగా 39,059 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ అర్బిటర్ అత్యంత విపరీతమైన కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. వెంటనే బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం వారు తమ ఆధీనంలోకి తీసుకొని మిషన్ చంద్రుడి పైకి వెళ్లేంతవరకు నియంత్రిస్తుంటారు.
చిత్రాలు.. చంద్రయాన్-2 మిషన్ ఉపగ్రహం
*ప్రయోగ వేదిక పై సిద్ధంగా ఉన్న రాకెట్