జాతీయ వార్తలు

‘లా కమిషన్’పై ఇక కేబినెట్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: దేశంలో గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి లా కమిషన్ లేకపోవడం వల్ల కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పుడు దానిని తిరిగి ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. లా కమిషన్ జటిలమయిన న్యాయపరమయిన అంశాలలో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటుంది. 21వ లా కమిషన్ మూడేళ్ల గడువు గత సంవత్సరం ఆగస్టు 31తో ముగిసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒకసారి లా కమిషన్‌ను తిరిగి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేసినప్పటికీ, అది ముందుకు సాగలేదు. ప్రభుత్వం తరువాత ఎన్నికల మానసికావస్థలోకి వెళ్లిపోయింది. లా కమిషన్‌ను తిరిగి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రానున్న కొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ ముందుకు రాబోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విశ్రాంత న్యాయమూర్తి బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని 21వ లా కమిషన్ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలకమయిన అంశాలపై నివేదికలు, వర్కింగ్ పేపర్లను సమర్పించింది.