జాతీయ వార్తలు

శాంతిభద్రతల గురించి మీరా మాట్లాడేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ‘పదిహేను నిమిషాల పాటు పోలీసులను తొలగించండి.. హిందువుల సంగతి చూసుకుంటాం’ అనే వ్యాఖ్యానించిన వారు శాంతిభద్రతల గురించి ప్రస్తావించవద్దని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కిషన్‌రెడ్డి సోమవారం లోక్‌సభలో జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు బదులిస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వానికి ప్రజలందరు సమానమే.. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులందరు తమకు సమానమేనని
ప్రకటించారు. 15 నిమిషాలపాటు పోలీసులను తొలగిస్తే 130 కోట్ల మంది హిందువుల సంగతి చూసుకుంటామనేది మీ మనసత్వం తప్ప మా మనస్తత్వం కాదని ఎంఐఎం సభ్యుడు ఒవైసీని ఉద్దేశించి కిషన్‌రెడ్డి ఆవేశంతో అన్నారు. శాంతిభద్రతల గురించి ఆయన మాకు నేర్పించవలసిన అవసరం ఎంతమాత్రం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘మీలా మేమెప్పుడూ మాట్లాడం.. ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టం’ అని తెగేసి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ పలుమార్లు లేచి కిషన్‌రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. ఈ దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతను ఓటర్లు బీజేపీకి అప్పగించారు.. అందరి ప్రయోజనాల పరిరక్షణ కోసమే పనిచేస్తాం’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ దేశంలోని హిందువులు, హిందువుల దేవతలు, శ్రీరాముడిని విమర్శించేవారు శాంతిభద్రతల గురించి మాట్లడటం ఏమిటంటూ కిషన్‌రెడ్డి ఒవైసీపై విరుచుకుపడ్డారు.