జాతీయ వార్తలు

వైపరీత్యాలను తట్టుకునే విత్తనాల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: కరవు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విత్తనాల అభివృద్ధికి కృషి జరుతున్నదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. రాజ్యసభలో సోమవారం ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని, మొలకెత్తే వంగడాలను రూపొందించడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేయవచ్చని ఆయన అన్నారు. ఇలాంటి ఆధునిక విత్తనాల అభివృద్ధి జరిగితే, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అన్నారు. తద్వారా దేశం స్వయం సమృద్ధికావడమేగాక, విదేశాలకు ఎగుమతులు చేయగలుగుతుందని జావడేకర్ తెలిపారు. జాతీయ వాతావరణ మార్పులు, వ్యవసాయం, ఆవిష్కరణల సంస్థ (ఎన్‌ఐసీఆర్‌ఏ) పర్యవేక్షణలో కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఇప్పటికే అధ్యయనాలను మొదలు పెట్టిందని అన్నారు. వరి, గోధుమ, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, బంగాళదుంప (ఆలుగడ్డ) తదితర పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దారుణంగా దెబ్బతింటున్నాయని జావడేకర్ తెలిపారు. అందుకే, ఇలాంటి పంటల పరిరక్షణకు సరికొత్త వంగడాల అవసరం ఉందన్నారు.