జాతీయ వార్తలు

రాజీనామా బాటలో కేశినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: తెలుగుదేశం విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) తెలుగుదేశం పార్టీతోపాటు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనే వార్తలు దేశ రాజధానిలో గుప్పుమన్నాయి. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని సిద్ధం చేయాలంటూ ఆయన తెలుగుదేశం కార్యాలయ సిబ్బందిని ఆదేశించటం చర్చనీయాంశంగా మారింది. కేశినేని శ్రీనివాస్ సోమవారం పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కార్యదర్శి సత్యనారాయణను పిలిచి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారాన్ని కొందరు నాయకులు వెంటనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేశ్ ఇటీవల బీజేపీలో చేరడం తెలిసిందే. వారు చేరినప్పుడే కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. అయితే నాని మాత్రం తెలుగుదేశంలోనే ఉండిపోయారు. ఇటీవల కేశినేని నానికి కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకులతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ విభేదాలను పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రయత్నించకపోవటం పట్ల నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పట్టుదలతో వ్యవహరించే కేశినేని శ్రీనివాస్ అవసరమైతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయటంతోపాటు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలుగుతారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. శ్రీనివాస్ రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేశినేని నాని వెళ్లిపోతే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ మనుగడకే ప్రమాదం వస్తుందని వారంటున్నారు. సుజనా చౌదరి రెండు రోజుల క్రితం కేశినేని శ్రీనివాస్‌తో చర్చలు జరిపినట్లు తెలిసింది.