జాతీయ వార్తలు

అలాంటి ప్రతిపాదన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: విదేశాల్లో పూర్తిచేసిన ఏడాది పోస్టుగ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీని గుర్తింపునకు సంబంధించి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈమేరకు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ సోమవారం లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్(ఏఐయూ) నిబంధనలను అనుసరించి ప్రస్తుతం ఓ విధానం నడుస్తోంది. విదేశాల్లో ఆమోదిత విశ్వవిద్యాలయాల్లో రెండేళ్ల పీజీ డిగ్రీకే ఇప్పడ గుర్తింపుఉంటుంది. అది కూడా అక్రిడిడేటెడ్ వర్శిటీల డిగ్రీలకే వర్తిస్తుంది’అని మంత్రి వివరించారు.విదేశీ యూనివర్శిటీల్లో ఏడాది పీజీ మాస్టర్ డిగ్రీని భారత్‌లో గుర్తించాలన్న ప్రతిపాద ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉన్నత విద్యా రంగంలో డిగ్రీలకు సమాన గుర్తింపు, అర్హతలు వంటి సమస్యలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సారథ్యంలోని కమిటీ పర్యవేక్షిస్తోంది పోక్రియాల్ వెల్లడించారు. యూజీసీ కమిటీ నివేదికను అనుసరించే విదేశీ వర్శిటీలతో ఒప్పందాలు జరుగుతుంటాయని అన్నారు.