జాతీయ వార్తలు

‘్భరత్ మాతాకీ జై’ అనొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవబంద్, ఏప్రిల్ 1: ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదం ఇస్లాంకు వ్యతిరేకమని, అందువల్ల ఆ నినాదం ఇవ్వకూడదని ప్రముఖ ఇస్లాం విద్యాసంస్థ దారుల్ ఉలూమ్ దేవబంద్ శుక్రవారం ముస్లిం మతస్థులకు ఫత్వా జారీ చేసింది. ఇస్లాంలో దేవుడు ఒక్కడే ఉంటాడని, అందువల్ల ‘్భరత్ మాతాకీ జై’ అని నినదించడం సరికాదని దారుల్ ఉలూమ్ దేవబంద్ పేర్కొంది. ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదంపై జరుగుతున్న చర్చపై స్పందిస్తూ ‘మేము దేశాన్ని ప్రేమిస్తాం. అయితే మేము దేవుడు ఒక్కడే ఉన్నాడని విశ్వసిస్తాం’ అని దారుల్ ఉలూమ్ తెలిపింది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ముస్లింలు స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని దారుల్ ఉలూమ్ దేవబంద్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశభక్తి స్ఫూర్తితో గొప్పగా నిర్వహించుకోవాలని కూడా ముస్లింలను కోరింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో దారుల్ ఉలూమ్‌కు చెందిన ఉలేమాలు (ఇస్లాం మత నాయకులు) ఎంతో కీలకమైన పాత్ర పోషించారని ఆ సంస్థ అధికార ప్రతినిధి అషఫ్ ఉస్మాని చెప్పారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో దారుల్ ఉలూమ్ సంపూర్ణ స్వాతంత్య్రం (కంప్లీట్ ఇండిపెండెన్స్) కోసం పిలుపునిచ్చిందని, తరువాత కాలంలో అదే ‘పూర్ణ స్వరాజ్’ ఉద్యమంగా మారిందని ఆయన పేర్కొన్నారు. మాతృదేశ విముక్తి కోసం హుస్సేన్ అహ్మద్ మదాని నుంచి వౌల్వీ అహ్మదుల్లా షా వరకు అనేక మంది తమ ప్రాణాలను అర్పించారని ఉస్మాని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని, స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని, విద్యార్థులకు భారత స్వాతంత్య్రోద్యమం గురించి, దేశం అసలు స్వరూపమైన భిన్నత్వంలో ఏకత్వం గురించి బోధించాలని దేశవ్యాప్తంగా గల అన్ని మదరసాలను కోరినట్లు దారుల్ ఉలూమ్‌కు చెందిన ఆధ్యాత్మిక నాయకుడు వౌలానా అర్షద్ ఖాస్మి చెప్పారు.