జాతీయ వార్తలు

రెబెల్స్ ఎమ్మెల్యేలు డుమ్మా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 15: కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈనెల 18న విశ్వాస పరీక్షకు సిద్ధమైన నేపథ్యంలో ముంబయి హోటల్‌లో మకాం వేసిన రెబెల్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముంబయి హోటల్‌లో బస చేసిన ఎమ్మెల్యేలు గురువారం జరిగే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం తలపెట్టిన బలపరీక్షకు హాజరు కావల్సి ఉంది. అయితే, రెబెల్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ముంబయిలో సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్న వర్గాలు సోమవారం తెలిపాయి. ముంబయి హోటల్‌లో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలంతా తమ రాజీనామా పత్రాలు స్పీకర్ అందజేసిన సంగతి తెలిసిందే. ‘ఇక్కడ ఉన్న రెబెల్స్ అంతా రాజీనామాలకు కట్టుబడే ఉన్నారు.. బల పరీక్షకు హాజరు కావడానికి వారు ఎంతమాత్రం ఇష్టపడడం లేదు’ అని సమన్వయ వర్గాలు చెబుతున్నాయి. ముంబయికి రాని ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు వీరు చెబుతున్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే లేదా ఇతర కాంగ్రెస్ నాయకులను కలిసేందుకు రెబెల్స్ ఇష్టపడడం లేదు. ఈ సంగతిని ఒక లేఖ ద్వారా ముంబయి నగర పోలీస్ చీఫ్‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నాయకుడు ఖర్గేతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలంతా రెబెల్ ఎమ్మెల్యేలను కలవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘కచ్చితంగా ఖర్గే లేదా మరే నాయకుడినీ కలవాలని మేము ఎంతమాత్రం అనుకోవడం లేదని’ రెబెల్స్ రాసిన లేఖలో పేర్కొన్నారు. తమను కలిసేందుకు వచ్చే కాంగ్రెస్ నేతలు భయపెట్టే ప్రమాదం ఉన్న దృష్ట్యా రక్షణ కావాలని ముంబయి పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు 15మంది ఇక్కడి హోటల్‌లో బస చేశారు.