జాతీయ వార్తలు

మరో ఆరు మృతదేహాలు వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, జూలై 15: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో భవనం కూలిపోయిన ఘటనకు సంబంధించి మరో ఆరు మృతదేహాలు సోమవారం వెలికితీశారు. భవన శిథిలాల కింద చిక్కుకుని మొత్తం 14 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. 17 మంది సైనికులతో పాటు 11మంది పౌరులు గాయపడ్డారు. నహాన్-కుమార్తట్టి రోడ్డులోని నాలుగు అంతస్తుల భవవనం ఆదివారం కూలిపోయింది. భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఆ భవనంలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇప్పటి వరకూ శిథిలాల కింద నుంచి 14 మృతదేహాలు వెలికి తీశారు. అందులో సైనికులవి 13, పౌరుడిది ఒకటి ఉన్నాయి. ‘ఇప్పటికి గాలింపుచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అన్న కోణంలో గాలింపుజరుగుతోంది’ అని డిప్యూటీ పోలీసు కమిషనర్ కేసీ చమన్ తెలిపారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సోమవారం ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికిగల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై మెజిస్టిరియల్ విచారణకు ఇప్పటికే ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన చెప్పారు. భవన యజమానిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు చమన్ పేర్కొన్నారు. భవన నిర్మాణాల్లో నిబంధనలు పాటించలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి అనేకం ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణాదళం సహాయ పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందని ఆయన వివరించారు. ప్రమాదం జరిగే సమయంలో భవనంలో 35 మంది ఆర్మీ ఉద్యోగులున్నారని, అందులో 30 మంది జూనియర్ కమిషన్డ్ అధికారులున్నారని గాయపడ్డ సైనికులు తెలిపారు. సైనికులు 4 అస్సాం రెజిమెంట్‌కు చెందిన వారని దగ్షాయి కంటోనె్మంట్‌కు చెందిన సైనికులు విందు చేసుకోడానికి రెస్టారెంట్‌కు వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. ఆర్మీ సిబ్బందితో పాటు 50 మంది రెస్టారెంట్‌లో ఉన్నారని గాయపడ్డ రాకేశ్ కుమార్ తెలిపారు. పది పదిహేను నిమిషాలు శిథిలాల కిందే ఉండి సురక్షితంగా భయపడినట్టు ఆయన వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు రెండు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారని డైరెక్టర్-కమ్ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు.