జాతీయ వార్తలు

హ్యాట్సాఫ్.. ఇస్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని సాంకేతిక సమస్య కారణంగా చివరి క్షణంలో ఇస్రో వాయిదా వేయడం మంచిదైందని శాస్తవ్రేత్తలు స్పష్టం చేశారు. దీన్ని పట్టించుకోకుండా ఈ ప్రయోగాన్ని సాగించి ఉంటే భారీ వైఫల్యానే్న చవిచూడాల్సి వచ్చేదని, అందుకు అవకాశం లేకుండా ఇస్రో ఈ ప్రయోగాన్ని వాయిదా వేసుకుందని అనేక మంది అంతరిక్ష శాస్తవ్రేత్తలు సోమవారం నాడు ఇక్కడ స్పష్టం చేశారు.
అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఇస్రో సక్సెస్ రేట్ అభినందనీయ స్థాయిలో ఉందని, చివరి క్షణం వరకు ప్రయోగానికి సంబంధించిన పరికరాలను నూటికి నూరు శాతం తనిఖీ చేసుకున్న తర్వాత ఈ ప్రయోగాలు జరపడం వల్లే ఇది సాధ్యమైందని కోల్‌కతాలోని భారత శాస్త్ర విద్యా పరిశోధన సంస్థకు చెందిన అంతరిక్ష శాస్తవ్రేత్త కుంబ్లేనాయక్ అన్నారు. తొందరపడి ప్రయోగం జరిపి వైఫల్యాన్ని చవిచూడడం కంటే సాంకేతిక లోపాన్ని గుర్తించినందున వాయిదా వేసుకోవడమే మంచిదైందని ఆయన అన్నారు. చంద్రయాన్-2కు సంబంధించి సాంకేతిక లోపం ఏదున్నా, సరిదిద్దుకుని ఈ మిషన్‌ను ఇస్రో విజయవంతంగా పూర్తి చేయ గలుగుతుందన్న ఆశాభావాన్ని అనేక మంది శాస్తవ్రేత్తలు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడానికి ముందు ప్రయోగ వాహకంలోనూ, అందులోని ఉపగ్రహాలకు సంబంధించి ప్రతి భాగాన్ని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవడం వల్లే సాంకేతిక సామర్ధ్యం ఇనుమడిస్తుందని, ప్రయోగ వైఫల్యాలను నిరోధించవచ్చునని ముంబయిలోని టాటా ప్రాథమిక పరిశోధనా సంస్థకు చెందిన ప్రొఫెసర్ సుదీప్ భట్టాచార్య అన్నారు. చివరి క్షణం వరకు ఇలాంటి ప్రయోగాల విషయంలో అప్రమత్తత అన్నది ఎంతో అవసరమని, చంద్రయాన్-2 ప్రయోగాన్ని వాయిదా వేసుకోవడమన్నది ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘనత ఇస్రో బృందానికి చెందుతుందని చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి లోపరహిత రీతిలో ఇస్రో మరింతగా సన్నద్ధమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత శాస్త్ర సాంకేతిక శక్తి నాణ్యతకు చంద్రయాన్-2 ఓ పరీక్షలాంటిదని, అలాగే ఇస్రో సామర్ధ్యానికి ఈ మిషన్ నిలువుటద్ధమని ప్రొఫెసర్ దివ్యేందునంది అన్నారు.
చంద్రయాన్-2లో భాగంగా ఇస్రో రూపొందించిన పరికరాలన్నీ కూడా సాంకేతికంగా ఎంతో ఉన్నత నాణ్యతతో కూడుకున్నవని, అయితే ఈ పరికరాలన్నీ కూడా లోపరహితంగా పనిచేసినప్పు డే మాత్రమే ఏ ప్రయోగమైనా విజయవంతమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో భారత్ జరపబోయే అంగారక గ్రహ పరికరానికి గ్రహ శకల అధ్యయనానికి కూడా చంద్రయాన్-2 సన్నద్ధత ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్తవ్రేత్తలు తెలిపారు.
చిత్రం... చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం అర్ధరాత్రి శ్రీహరి కోటకు వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు