జాతీయ వార్తలు

‘రహదారుల అభివృద్ధికి సహకరించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు రంజిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్‌సభ సమావేశంలో ఈ ఏడాది రోడ్లు, రహదారుల కేటాయింపులు, పద్దులపై జరిగిన చర్చలో రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల భద్రతకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను ప్రదర్శిస్తున్నదని ఆయన విమర్శించారు. రోడ్డు భద్రతకు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం 0.3 శాతం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నిధులు ఏ మాత్రం ఉపయోగపడవని ఆయన తెలిపారు. కేంద్రం కేటాయించిన 0.3 శాతం నిధులు అంటే సుమారు రూ. 280 కోట్లు అని తెలిపారు. దాదాపుగా 130 కోట్లకు పైగా ఉన్న జనాబాకు ఈ నిధులు ఏ విధంగా సరిపోతాయని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.