జాతీయ వార్తలు

అంతర్జాతీయ స్థాయికి రాజమండ్రి ఎయిర్ పోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: రాజమండ్రి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో భరత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే 1750 మీటర్ల విస్తీర్ణం కలిగిన రన్-వేను 3125 మిటర్లకు విస్తరించారని, అలాగే రన్-వే 45 మీటర్ల వెడల్పును విస్తరించారని తెలిపారు. విమాననాశ్రయం ప్రాంతంలో నేషనల్ క్రికేట్ స్టేడియంనూ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కూడా ఆయన చెప్పారు. గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇతర దేశాలకు వెళుతున్నారని, రాజమండ్రి విమానాశ్రయన్ని అంతర్జాతీయ సర్వీసులు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఈ విమానాశ్రయం అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని మార్గాని భరత్ చెప్పారు.