జాతీయ వార్తలు

పరువు నష్టం దావా కేసులో రాహుల్‌గాంధీకి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, జూలై 16: రాహుల్‌గాంధీపై దాఖలైన పరువునష్టం దావా కేసులో కోర్టులో వ్యక్తిగత హాజరుకు సంబంధించి కాంగ్రెస్ నేతకు తాత్కాలికంగా ఊరట లభించింది. ‘మోదీ ఇంటి పేరు’ వాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గుజరాత్ (సౌత్ వెస్ట్) ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్ 16వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న జ్యుడీషియల్ కోర్టు చీఫ్... రాహుల్ వ్యక్తిగత హాజరుకు సంబంధించి ఆయన లాయర్ చేసిన విజ్ఞప్తి మేరకు అక్టోబర్ పదో తేదీకి హాజరు కావాలని ఆదేశించారు. ‘మోదీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలే’అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఇటీవలి ఎన్నికల్లో వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం రాహుల్ కోర్టుకు హాజరు కావల్సి ఉంది. అయితే, అంతకుముందే ఖరారైన పనుల నేపథ్యంలో బిజీగా ఉన్నందున రాహుల్ వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈమేరకు మెజిస్ట్రేట్ బీహెచ్ కపాడియా సమన్ల మేరకు అక్టోబర్ పదో తేదీ నాటికి హాజరు కావాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. కర్నాటకలోని కోలార్‌లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ ఇలా మోదీ ఇంటిపేరున్న వారంతా దొంగలే’నని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘మోదీ ఇంటి పేర ఉన్నంత మాత్రాన అందరూ ఎలా దొంగలు అవుతారంటూ’ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ కోర్టులో రాహుల్‌పై ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ జిల్లా కోపరేటివ్ బ్యాంక్‌పైన, ఆ బ్యాంకు చైర్మన్ అజయ్‌పటేల్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో గత వారం రాహుల్ అలహాబాద్ కోర్టుకు హాజరయ్యారు.