జాతీయ వార్తలు

పోస్ట్‌మాన్ ఉద్యోగాల భర్తీ పరీక్ష రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తపాలా శాఖలో పోస్ట్‌మాన్ ఉద్యోగాల భర్తీకోసం ఇటీవల నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల, ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రకటించారు. తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకోసం కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభలో సోమవారం తమిళనాడుకు చెందిన అన్నాడిఎంకే, డిఎంకే సభ్యులు ఆందోళన నిర్వహించారు. పోస్ట్‌మాన్ ఉద్యోగాల భర్తీకోసం గత ఆదివారం నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తపాలా శాఖ పరీక్షలను తమిళ భాషలో కూడా నిర్వహంచాలని అన్నాడిఎంకే, డిఎంకే, కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వచ్చి పదే పదే అడ్డు తగలడంతో సోమవారం రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను చైర్మన్ సభకు సమర్పింపజేశారు. అనంతరం తపాల శాఖ పరీక్షలకు సంబంధించిన అంశాన్ని తమిళనాడు చెందిన అన్నాడిఎంకే, డిఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యులు లేవనేత్తారు. ఒక్కసారిగా సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చైర్మన్ వెంకయ్య నాయుడు సభను వాయిదా వేశారు. 30 నిమిషాల అనంతరం సభ ప్రారంభం కాగానే అన్నాడిఎంకే, డిఎంకే ఎంపీలు పోడియం వద్దకు వచ్చి మరోసారి ఆందోళన నిర్వహించారు. దీంతో డిపూటీ చైర్మన్ హరివంశ్ 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం సభ సమవేశం కాగానే పార్లమెంటరీ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ దీనిపై సమాధానం ఇస్తారని సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ సభ్యులను కోరారు. అయినప్పటికీ ఆందోళన ఆగలేదు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇస్తూ గత ఆదివారం తపాల శాఖ నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరీక్షను అన్ని భారతీయ భాషలలో త్వరలో నిర్వహించే విధంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అన్ని ప్రాంతీయ భాషలు సమానమేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను అభినందించడంతోపాటు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు స్వాగతించారు.

చిత్రం...కేంద్ర కమ్యూనికేషన్ల, ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్