జాతీయ వార్తలు

శిథిల భవనం కింద 40 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 16: ముంబయి దోంగ్రి ప్రాంతంలో గల తాండేల్ వీధిలో మంగళవారంనాడు ఉదయం వందేళ్లనాటి పురాతన భవనం కూలిన సంఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. దాదాపు 40 మంది వరకు కుప్పకూలిన ఈ భవనం కింద చిక్కుకుని ఉండవచ్చునని బ్రిహ్మనిముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికార వర్గాలు తెలిపాయి. తొలుత భవనం కూలిన సంఘటనలో 12 మంది మరణించారని వార్తలు వెలువడగా, తమ ప్రాథమిక విచారణలో కేవలం నలుగురు మాత్రమే మరణించారని తెలుస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రాధాకృష్ణ వికీ పాటిల్ తెలిపారు. భవనం చాలా ఇరుకైన ప్రాంతంలో ఉండడంతో సహాయక చర్యలు కొనసాగడం కష్టంగా మారింది. అత్యవసర వాహనాలు ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి వెళ్లలేపోతున్నాయి. కాగా, స్థానికులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో దాదాపు 100 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాగా, సహాయక చర్యలు చురుకుగా కొనసాగించేందుకు వీలుగా సమీప ఇళ్లల్లోని ప్రజలు దూరంగా వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇరుకైన ప్రాంతంలో గల ‘కేసర్‌బాయ్’ పేరు గల నాలుగు అంతస్థులు కలిగిన ఈ పురాతన భవనాన్ని కూల్చివేయాలని బ్రిహ్మన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంహెచ్‌ఏడీఏ)కి హెచ్చరించినట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, భవనం కూలిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దర్యాప్తునకు ఆదేశించారు. ‘నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 15 కుటుంబాలు ఈ భవనంలో నివసిస్తున్నారు. ఈ భవనం దాదాపు వందేళ్లకు పైబడింది. ఈ పురాతన భవనాన్ని పునరుద్ధరించేందుకు వీలుగా ఇందులోని నిర్వాసితులు ఎంహెచ్‌ఏడీఏను ఆశ్రయించారు. అయితే, దీనిపై అధికారులు తీసుకున్న చర్యలపై విచారణను ప్రారంభించాం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇపుడు తమ దృష్టి అంతా భవనం కింద చిక్కుకుపోయిన కుటుంబాల కోసమేనని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా తగిన నష్టపరిహారం అందజేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోదీ సైతం పురాతన భవనం కూలిన ఘటనలో 12 మంది మృతి చెందడం పట్ల తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు పీఎంఓ కార్యాలయం ట్వీట్ ద్వారా తెలిపింది.
చిత్రాలు.. ...నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ప్రాంతంలో సహాయ చర్యలు చేపడుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది