జాతీయ వార్తలు

జంతుజాలం జల దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజిరంగ/గౌహతి, జూలై 16: గత రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలను ప్రధానంగా అస్సాంను కకావికలం చేస్తున్న కుంభవృష్టికి ప్రపంచ ప్రఖ్యాత వణ్య సంరక్షణ కేంద్రమైన కజరంగ జాతీయ పార్క్ 90 శాతానికి పైగా మునిగిపోయింది. దాదాపు 10 లక్షలకు పైగా విభిన్న జంతుజాతి ఈ ముంపు వల్ల దెబ్బతిన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న ఈ జంతుజాలానికి అధికారులు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. రాష్ట్రంలోని గోలాఘాట్, నాగం అనే రెండు జిల్లాలకు 430 చదరపు కిలోమీటర్ల మేర ఈ వణ్య సంరక్షణ కేంద్రం విస్తరించింది. ముఖ్యంగా ఒంటికొమ్ము కలిగిన ఖడ్గమృగాలు ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో ఇక్కడే ఉన్నాయి. ఈ కేంద్రానికి యునెస్కో గుర్తింపు కూడా లభించింది. రైనోలతోపాటు పులులు, ఏనుగులు, జింకలు, అడవి దున్నలు సహా అనేక జంతుజాలాలకు ఇది కీలకమైన ఆవాసంగా కొనసాగుతోంది. జలమయమైన ప్రాంతం నుంచి పరుగులు పెడుతున్న జంతువులు బయటకు రావడానికి వీలుగా సమీపంలోని జాతీయ హైవేలపై వాహనాల వేగాన్ని అధికారులు నియంత్రించారు. ముఖ్యంగా 37వ నెంబర్ జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు. దీనివల్ల ఈ జంతువులు ఎగువు ప్రాంతమైన కార్వీ అన్‌గ్లోన్ కొండ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే జంతు సమూహాలు ఈ పార్క్ నుంచి బయటకు రావడం మొదలైందని, వీటిని రక్షించేందుకు ముఖ్యంగా అరుదైన జాతిగా మారుతున్న రైనోలను కాపాడేందుకు హైవే పొడవునా భారీ ఎత్తున బలగాలను మోహరించారు. గత రెండు రోజుల్లో 23కు పైగా జంతువులు మరణించినట్టుగా చెబుతున్నారు. వీటిలో చాలా జంతువులు హైవేపై వెళ్తున్న వాహనాలు ఢీకొనడం వల్లే మరణించాయని, మరికొన్ని జంతువులు గాయపడ్డాయని అధికారులు నిర్ధారించారు. ఇదిలావుండగా, కజరంగ పార్క్ సిబ్బంది, భద్రతా సిబ్బంది మెకనైజ్డ్ బోట్లు, దేశవాళీ బోట్ల ద్వారా తమ విధుల్లో నిమగ్నమయ్యారు. అటవీ సిబ్బందికి తోడు ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్, అస్సాం పోలీసులతో సహా సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున మోహరించి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కజరంగ్ పార్క్‌లో వివిధ రకాల జంతువులు భారీ వరదల కారణంగా తీవ్రంగా గాయపడ్డాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంది నాబా కుమార్ డోలే కజరంగ పార్క్‌కు మంగళవారంనాడు హుటాహుటిన చేరుకుని జంతువుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఏఎం సింగ్ పార్క్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోమవారంనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్‌తో మాట్లాడి పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా అవసరమైన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

చిత్రాలు.. అరుదైన జంతు జాలానికి ఆవాసమైన అసాంలోని కజరంగా వన్య సంరక్షణ కేంద్రం తొంభై శాతం మునిగిపోవడంతో జంతుజాతులు కకావికలం అయ్యాయి. ఓ ఎత్తయిన ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్న ఓ జింక