జాతీయ వార్తలు

పేదరిక నిర్మూలనే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం వెల్లడించారు. ‘ఈ పథకం కేవలం పేదలకు ఉద్దేశించింది.. మోదీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉంది’ అని తోమర్ పేర్కొన్నారు. లోక్‌సభలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు 2019-20 బడ్జెట్‌లో కేటాయింపులపై జరిగిన చర్చలో తోమర్ ప్రసంగించారు. ఉపాధి హామీ పథకంలో నిధుల కేటాయింపులు తగ్గాయని పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన నిధులకన్నా ఈసారి ఎక్కువే కేటాయించామని స్పష్టం చేశారు. గత సంవత్సరం ఈ పథకానికి 55వేల కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో 60వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతోంది.. 99 శాతం మంది కార్మికులకు వారి వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పడుతున్నాయి.. దీంతో మధ్య దళారులు, బ్రోకర్ల ప్రమేయం ఉండడం లేదు.. అయితే, దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఈ దశగా పనిచేస్తున్నాం.. అందుకే పేదలకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువ కాలం కొనసాగించాలని కేంద్రం భావించడం లేదు’ అని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో ఉపాధి కల్పనలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మహిళ కృషిని ఆయన ప్రశంసించారు. మహిళా గ్రూపులకు ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయిలను రుణాలుగా ఇస్తోందనీ, ఈ రుణాన్ని మహిళలు సక్రమంగా చెల్లించడం అభినందనీయమని చెప్పారు. కేవలం 2.7 శాతం మాత్రమే ఎన్‌పీఏలుంటున్నాయని, పైగా గ్రామాల్లోని నిరుపేద మహిళలకు వీరు ఉపాధి కల్పిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మొత్తం కార్పొరేట్ల ఎన్‌పీఏలతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని మంత్రి తోమర్ స్పష్టం చేశారు.
బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణకు చర్యలు : సంజయ్ ధోత్రే
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించామనీ.. త్వరలోనే వీటి ఫలితాలను చూస్తారని లోక్‌సభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం టెలికం శాఖ సహాయ మంత్రి సంజయ్ దోత్రే పేర్కొన్నారు. లైసెన్స్‌డ్ ఏరియాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 2జీ, 3జీ, 4జీ సేవలను అందిస్తోందని స్పష్టం చేశారు. ‘దాదాపు 15వేల కోట్ల నష్టాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ కొనసాగుతోందనీ, కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లింపు చేయడం కూడా కష్టంగా ఉంది’ అని మంత్రి చెప్పారు. భారత్ సంచార నిగం లిమిటెడ్ పునరుజ్జీవానికి అవసరమైన చర్యలు తీసుకొంటామని మంత్రి పేర్కొన్నారు.