జాతీయ వార్తలు

విదేశీ జైళ్లలో భారత ఖైదీలు 8,189

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది మంది భారతీయ ఖైదీలు విదేశీ జైళ్లలో మగ్గుతున్నారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అందులో అండర్ ట్రయల్ ఖైదీలూ ఉన్నారని తెలిపింది. అత్యధికంగా సౌదీ అరేబియాలోని జైళ్లలో 1811 మంది భారతీయులున్నారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 1392, నేపాల్‌లో 1160 మంది భారతీయ ఖైదీలున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.‘ మంత్రిత్వశాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మే 31 నాటికి విదేశీ జైళ్లలో 8,189 మంది మన ఖైదీలున్నారు. అందులో విచారణ ఖైదీలూ ఉన్నారు’అని వెల్లడించారు. ఆయా దేశాల్లోని గోపత్యా చట్టాల వల్ల స్థానిక అధికారుల నుంచి ఖైదీలకు సంబంధించి సమాచారం అందడం లేదు’అని మురళీధరన్ పేర్కొన్నారు. ‘2016 నుంచి ఇప్పటి వరకూ గల్ఫ్ దేశాల్లో 3,087 మంది భారతీయులు అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు’అని మంత్రి చెప్పారు.