జాతీయ వార్తలు

సంస్కరణలకు అనుగుణంగా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న సంస్కరణలకు అనుగుణంగా ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు, కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారు. భారతీయ వ్యవసాయ విధానంలో మార్పులపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల హైపరవ్ కమిటీ గురువారం నాడిక్కడ సమావేశమైంది. కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్ సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతూ రైతులు దేశాభివృద్ధిలో ప్రాధాన్యవహిస్తున్న దృష్ట్యా వ్యవసాయ, వాణిజ్య శాఖల మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రులు మార్కెటింగ్, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, నిధుల కేటాయింపులో, ఫైనాన్స్ కమిషన్‌కు చెందిన నిధుల కేటాయింపుల్లో రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణలకు అనుగుణంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే ఆహార రంగంలో నిత్యావసర సరుకుల చట్టం 1955ను వినియోగిస్తున్న తీరు సైతం సక్రమంగా లేదని పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ చట్టాన్ని పక్కనపెట్టడమే సబబుగా ఉంటుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఈ సందర్భంగా సూచించారు. అలాగే వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణ సదుదుపాయాన్ని రూ. 13 లక్షల కంటే అధికంగా పెంచాలని ఫడ్నవిస్ సూచించారు.