జాతీయ వార్తలు

రాద్ధాంతం.. గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వ భవిత డోలాయమానంలో పడింది. గురువారం అసెంబ్లీలో జరగాల్సిన బల పరీక్ష గందరగోళమయంగా మారింది. ప్రతిపక్ష బీజేపీ అధికార కూటమి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఫలితంగా బల పరీక్ష శుక్రవారం ఉదయానికి వాయిదా పడింది. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా సభలోనే బీజేపీ ధర్నాకు దిగింది. గురువారం ఉదయం నుంచీ సభ రేపటికి వాయిదా పడే వరకు అంతా అయోమయం..గందరగోళం.. ఉత్కంఠ ఏమి జరగబోతోందో అంతుబట్టని పరిస్థితుల మయంగానే సభ సాగింది. ఫలితంగా బలపరీక్ష జరపడానికి ఏ మాత్రం అనుకూలమయమైన వాతావరణం లేకపోవడంతో రేపటికి వాయిదా పడింది. అసెంబ్లీ లోపల బయటాకూడా రెండు కూటముల మధ్య అనేక మలుపుల మయంగా హైడ్రామా సాగింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ముందుగా అనుకున్నట్టుగా సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన ప్రభుత్వం పట్ల సభకు పూర్తి విశ్వాసం ఉందని ఏక వాఖ్యంతో ఈ తీర్మానం సాగింది. అయితే 17 మంది అధికార కూటమి సభ్యులు సహా మొత్తం 20 మంది సభకు రాలేదు. వీరిలో 12 మంది ముంబయిలోని ఓ హోటల్‌లోనే ఉండిపోయారు. అయినప్పటికీ కుమారస్వామి విశ్వాస తీర్మానంపై ఉద్రేక పరిస్థితుల మధ్య సభలో చర్చ మొదలైంది. దీనిపై మాట్లాడిన కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలు తన ప్రభుత్వ మనుగడపైనే తమ చర్యద్వారా అనుమానాలు రేకెత్తించాలని అన్నారు. జాతికి ఈ విషయంపై వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కర్నాటక పరిణామాలను యావత్‌భారతం గమనిస్తోందని ఆయన అన్నారు. ఆ దశలో తన స్థానం నుంచి లేచి నిలబడ్డ బీజేపీ నేత యెడ్యూరప్ప విశ్వాస పరీక్షను ఒకే రోజులో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దానికి స్పందించిన కుమారస్వామి ‘ప్రతిపక్ష నాయకుడికి ఏదో తెలియని హడావుడి ఉంది’ అని వ్యాఖ్యానించారు. తన తీర్మానంపై ఓటింగ్ జరపాలని కుమారస్వామి కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ శాసనపక్ష నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో విప్‌కు సంబంధించిన అంశాన్ని స్పీకర్ తేల్చేవరకు ఓటింగ్‌ను వాయిదా వేయాలని కోరారు. కోర్టును ఆశ్రయించిన 17మంది రెబెల్ ఎమ్యెల్యేలకు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజర్ అయ్యే అవకాశం కలిగిందని, దీనిపై తక్షణమే స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని కోరారు. దీనిపై నిర్ణయం లేకుండా ఓటింగ్ జరిగితే అది రాజ్యాంగ బద్ధం కాదని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని సిద్ధరామయ్య అన్నారు. దీని దృష్ట్యా దీనిని వాయిదా వేయాలని కోరారు. దానికి స్పందించిన స్పీకర్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడుతానని చెబుతూ మొదట భోజన విరామ సమయం వరకు సభను వాయిదా వేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగం మొదలుపెట్టక ముందే అసెంబ్లీలో విప్‌కు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. దాంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పరస్పర ఆరోపణలతో ఇరుపక్షాలు గందరగోళాన్ని సృష్టించాయి.
అనుక్షణం వాగ్వివాదాలు, అవాంతరాలు, అవరోధాలు చోటుచేసుకోవడంతో మూడుసార్లు సభ వాయిదా పడింది. రెండు పక్షాల మధ్య సాగిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. దాంతో మరో మార్గాంతరం లేక సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ వాయిదాకు ముందు మాట్లాడిన బీజేపీ నాయకుడు యెడ్యూరప్ప తాము రాత్రి అంతా సభలోనే బయటాఇస్తామని, విశ్వాస తీర్మాన సమయం నిర్ణయం అయ్యేవరకు కదిలేది లేదని ప్రకటించారు. సభలో ఓటింగ్ జరపడంలో జరిగిన జాప్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు హుటాహుటిన గవర్నర్ వాజూభాయ్ వాలాను కలుసుకున్నారు. గురువారం నాడే విశ్వాస పరీక్షను పూర్తి చేయాలని స్పీకర్ కె.ఆర్ రమేష్‌కుమార్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను బీజేపీ బృందం అభ్యర్థించింది. దానిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ గురువారం సభ ముగిసేలోగా విశ్వాస ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పీకర్‌ను ఆదేశించారు. దీనిపై అధికార పక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాము సుప్రీంకు వెళ్లే ఆలోచన చేస్తున్నామని కూడా ఒక దశలో బీజేపీ సభ్యులు ప్రకటించారు.