జాతీయ వార్తలు

‘మహా’లో ఎన్నికల రథయాత్రల కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: మహారాష్టల్రో సార్వత్రిక ఎన్నికలకు రథ యాత్రల కోలాహలం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఇంకా గడువు ఉన్నప్పటికీ, రథ యాత్రల పోటా-పోటీ ఆరంభమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సంకల్పించిన ‘వికాస్ రథ యాత్ర’కు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అనుమతినిచ్చారు. నెల రోజుల పాటు జరిగే ఈ యాత్రకు అమిత్ షా పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆగస్టు 1న ఈ యాత్ర ప్రారంభించాలని ఫడ్నవీస్ భావిస్తున్నారు. ఈ యాత్ర సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలు, రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి ప్రజలకు వివరించనున్నారు. ఇలాఉండగా శివ సేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే శుక్రవారం ‘జన ఆశీర్వాద్ యాత్ర’ను ప్రారంభించారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీలు రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశంపై ఇప్పటికే ఆ పార్టీల మధ్య జగడం ఆరంభమైంది.
మహారాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షునిగా నియమితులైన చంద్రకాంత్ దాదా పాటిల్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ 220 సీట్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నదని తెలిపారు. ఈ మేరకు తమ పార్టీ యంత్రాంగం, ప్రతి కార్యకర్త నడుం బిగించినట్లు ఆయన చెప్పారు. గతంలో గెలుపొందని అసెంబ్లీ నియోజకవర్గాలపై, బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ఇప్పటి నుంచే దృష్టి సారించామని ఆయన వివరించారు.