జాతీయ వార్తలు

డెడ్‌లైన్లు బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 19: కర్నాటకలో రాజకీయ సంక్షోభం శుక్రవారం మరింత విషమించింది. శుక్రవారం కూడా కుమారస్వామి ప్రభుత్వ బలపరీక్ష వ్యవహారం మరింత సంక్షోభానికి దారి తీయడంతో అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. బల నిరూపణకు సంబంధించి గవర్నర్ జారీ చేసిన రెండు ఆదేశాలనూ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దాంతో ఈ రాజకీయ సంక్షోభం కాస్త రాజ్యాంగ సంక్షోభంగా మారే పరిస్థితి తలెత్తింది. శుక్రవారం సభ మొదలైనప్పటి నుంచీ ఉత్కంఠమయ రీతిలో హైడ్రామా సాగింది. మధ్యాహ్నం 1.30 గంటలకల్లా బలపరీక్ష పూర్తి కావాలని మొదట గవర్నర్ ఆదేశించారు. దాన్ని ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో రెండో సారి మరో ఆదేశం జారీ చేస్తూ సాయంత్రం 6 గంటలకల్లా విశ్వాస తీర్మాన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. దానిని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందో తెలియని అయోమయ వాతావారణం ఏర్పడింది. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి గవర్నర్ ఆదేశం జారీ చేయడం ఏమిటని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. శాసనసభ వ్యవహారాలపై గవర్నర్‌కు ఎలాంటి ప్రమేయం ఉండదని స్పష్టం చేస్తూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. మొదటి డెడ్ లైన్ దాటి పోవడంతో గవర్నర్ కార్యాలయం నుంచి అసెంబ్లీకి మరో సందేశం వచ్చింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి కుమారస్వామి ‘రెండో ప్రేమ లేఖ’గా అభివర్ణిస్తూ తిరస్కరించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సాగుతున్నా గవర్నర్ వాజుభాయ్ వాలాకు ఆ విషయం ఇప్పుడే గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. రెండో రోజూ విశ్వాస తీర్మానం వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్ రమేశ్ కుమార్ ‘సోమవారం ఈ వ్యవహారాన్ని తేల్చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని పొడిగించే ప్రసక్తి లేదు..’ అని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయంతో కుమార స్వామి ప్రభుత్వం కూడా ఏకీభవించింది. ముఖ్యమంత్రి కుమారస్వామికి రెండు సందేశాలు పంపిన గవర్నర్ ‘అసెంబ్లీలో ప్రభుత్వానికి మెజారిటీ సభ్యుల మద్ధతు లేదన్న అంశంపై నేను ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చాను’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు సాగుతున్నప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా శుక్రవారం నాడే విశ్వాస తీర్మానం వ్యవహారాన్ని తేల్చేయాలని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడడానికి వీల్లేదని ముఖ్యమంత్రి కుమార స్వామి అసెంబ్లీ పరీక్షను విశ్వాస పరీక్షను సాయంత్రం లోగా ఎదుర్కొవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. హార్స్ ట్రేడింగ్ నివారితం కావాలంటే బల పరీక్ష వ్యవహారాన్ని తక్షణమే తేల్చేయాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ రెండో లేఖపై మాట్లాడిన కుమార స్వామి ‘ఆయనకు ఇప్పుడే జ్ఞానోదయం అయ్యింది. ఇప్పటి వరకు ఎన్నో సార్లు మేము ఈ విషయాన్ని చెప్పినా, ఆయనకు ఇప్పుడే తెలిసినట్లు ఉందేమో’ నని వ్యాఖ్యానించారు.
రాజకీయాలు సాగించడానికి తామూ సిద్ధమేనని, తామేమీ పారిపోవడం లేదని, బెదిరిపోవడం లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పరంపరగా రాజీనామా చేస్తున్నప్పుడు హార్స్ ట్రేడింగ్ వ్యవహారాన్ని గవర్నర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. 15 మంది కాంగ్రెస్- జెడి(ఎస్) ఎమ్మెల్యేల రాజీనామాలను ముంబయిలోని ఓ హోటల్‌లో వారు బస చేసిన విషయాన్ని ప్రస్తావించిన కుమారస్వామి ‘ఎమ్మెల్యేల రాజీనామాలపై గవర్నర్ చర్యలు తీసుకుని ఉంటే ప్ర త్యేక విమానాన్ని పంపించాల్సిన అవసరం వచ్చేదా?’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు వెళ్ళే వరకు కూడా గవర్నర్ వారికి పోలీసు రక్షణ కూడా కల్పించారని కుమారస్వామి ఆరోపించారు. అంతిమంగా మీ రక్షణ కోరుతున్నామంటూ స్పీకర్‌నుద్ధేశించి మాట్లాడిన ఆయన గవర్నర్ విధించిన డెడ్ లైన్ వ్యవహారాన్ని స్పీకర్‌కే వదిలి వేస్తున్నట్లు తెలిపారు. సభలో గందరగోళం నెలకొన్న సమయంలో మాట్లాడిన బీజేపీ నాయకుడు యెడ్యూరప్ప విశ్వాస తీర్మానంపై వెంటనే ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఆదేశాన్ని పట్టించుకుంటారా? లేదా? అంటూ కుమారస్వామిని నిలదీశారు. అయితే సభా నియమ నిబంధనల ప్రకారమే తాను వ్యవహారిస్తానని స్పీకర్ తెలిపారు.