జాతీయ వార్తలు

అక్టోబర్‌లో మోదీ-జీజింపింగ్ శిఖరాగ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: భారత్-చైనాల మధ్య మరో కీలక భేటీకి రంగం సిద్ధమవుతోంది. చైనా అధ్యక్షుడు జీజింపింగ్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీల మధ్య అక్టోబర్‌లో జరగబోయే రెండో శిఖరాగ్ర భేటీకి భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా వచ్చే నెల ఆయన చైనాలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. బీజీంగ్ పర్యటనలో భాగంగా ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీయితో ఇరు దేశాల సంబంధాల తీరు తెన్నులపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే మోదీ-జింపింగ్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే ప్రాంతీయ అంశాలపై కూడా ఆ సందర్భంగా జైశంకర్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అక్టోబర్ 2వ వారంలో జరగబోయే ఈ కీలక భేటీకి సరైన పునాదులు వేయడమే జైశంకర్ పర్యటన ప్రధాన లక్ష్యమని అధికారవర్గాలు తెలిపాయి. ప్రజల మధ్య సంబంధాలు పెంపొదించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడమే మోదీ-జింపింగ్ తాజా భేటీ లక్ష్యంగా కనిపిస్తోంది. తొలి శిఖరాగ్ర భేటీలో అనేక అంశాలపై చర్చించిన ఇరువురు నేతలు వైషమ్యాలను కట్టిపెట్టి సన్నిహిత మైత్రీ బంధాన్ని నిర్మించుకోవాలన్న ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఆ దిశగా ఇప్పటి వరకు కొంత కసరత్తు జరిగింది.