జాతీయ వార్తలు

ఇరాన్‌తో భారత్ సంప్రదింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ లండన్, జూలై 20: ఇరాన్ స్వాధీనం చేసుకున్న బ్రిటన్ చమురు ట్యాంకర్‌లో ఉన్న 23 మంది సిబ్బందిలో 18 మంది భారతీయులే. ఇరాన్ వీరిని త్వరగా విడుదల చేసి, స్వదేశానికి పంపించేందుకోసం ఆ దేశంతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్‌కు చెందిన వ్యక్తి చేపల పడవను బ్రిటన్ చమురు ట్యాంకర్ ఢీకొందని, అంతర్జాతీయ మారిటైమ్ నియమాలను కూడా అది ఉల్లంఘించిందని, అందువల్ల దానిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఇరాన్ అధికార వార్తాసంస్థ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది. చమురు ట్యాంకర్ స్టెనా ఇంపెరోలో 18 మంది భారతీయులు ఉన్నారని ఢిల్లీలోని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ‘మేము సంఘటనకు సంబంధించి తదుపరి వివరాలను తెలుసుకుంటున్నాం. 18 మంది భారత జాతీయులను వెంటనే విడుదల చేసి, స్వదేశానికి పంపించేందుకు గాను మా మిషన్ ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. బ్రిటన్ చమురు ట్యాంకర్‌లో ఉన్న భారత్‌కు చెందిన 18 మంది సిబ్బందిని ఇరాన్ అధికారులు నిర్బంధించడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు.