జాతీయ వార్తలు

సిద్ధూ రూటు ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛండీగడ్, జూలై 20: పంజాబ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన నవజోతి సిద్దు తదుపరి వ్యూహం ఏమిటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారన్న ఆశాభావాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 14న ట్విట్టర్‌లో రాజీనామా ప్రకటన చేసినప్పటి నుంచి సిద్దు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయన తదుపరి వ్యూహం ఏమిటన్న దానిపై ఊహగానాలు సాగుతున్నాయి. ఎప్పుడైతే ఆ రాజీనామా లేఖను పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఎప్పుడైతే ఆమోదించారో అప్పటి నుంచి సిద్దు కాంగ్రెస్‌లోనే ఉంటారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.