జాతీయ వార్తలు

వ్యూహాలకు పదును..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 20: కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస తీర్మాన వ్యవహారాన్ని సోమవారం తేల్చేస్తామని అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తదుపరి వ్యూహానికి పదును పెడుతున్నాయి. సంక్షోభంలో పడ్డ కాంగ్రెస్-జెడీ (ఎస్) ప్రభుత్వ భవిత మరో రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉండడంతో వైరి పక్షాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జెడీ(ఎస్) వర్గాలు విశ్వాస ఓటింగ్‌లో ఓడించేందుకు ప్రతిపక్ష బీజేపీ నిశ్శబ్ధంగానే తదుపరి కార్యాచరణకు కసరత్తు మొదలుపెట్టాయి. ఇటు అధికార కూటమి, అటు ప్రతిపక్ష వర్గాలు సోమవారం అనుసరించే వ్యూహంపై శనివారం అంతర్గతంగా విస్తృత మంతనాలు సాగించాయి. ముంబయిలో తిష్ట వేసిన రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించుకునేందుకు సంకీర్ణ ప్రభుత్వ నేతలు ముమ్మర స్థాయిలో చివరి ప్రయత్నాలు చేపట్టారు. 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కుమారస్వామి ప్రభుత్వం పతనపుటంచులకు చేరుకుందన్న విషయం తెలిసిందే.
శుక్రవారం నాడే కుమారస్వామి తన మెజారిటీని నిరూపించుకోవాలంటూ గవర్నర్ వజుబాయివాలా రెండు సార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంకీర్ణ సర్కారు ఖాతరు చేయకపోవడంతో కర్నాటకం రాజకీయ సంక్షోభంగా మారింది. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకున్నారంటూ కాంగ్రెస్-జెడీ(ఎస్) పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అలాగే ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అంశంపైనా వివరణ ఇవ్వాలని కోరాయి. శుక్రవారం నాటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సంకీర్ణ సర్కారు నేతలు ఆదివారం సాయంత్రం భేటీకి సమాయత్తమవుతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి పార్టీ నాయకుడు సిద్దరామయ్య పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామని స్పష్టం చేసిన మంత్రి డికె శివకుమార్ ‘విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు మాజీ ప్రధాని వాజపేయ్‌కి 10 రోజుల వ్యవథి ఇవ్వలేదా?’ అని ప్రశ్నించారు. తమ కూటమికి చెందిన ఎమ్మెల్యేలను ముంబయిలో నిర్బంధించారని, వారిని సంప్రదించే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా వారు సోమవారం జరిగే బలపరీక్షకు గైర్హాజరైనా సంకీర్ణ కూటమి బలం (స్పీకర్ మినహా) 101కి పడిపోతుంది. ఫలితంగా ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. 225 సీట్లు కలిగిన అసెంబ్లీలో బీజేపీ బలం నామినేటెడ్ ఎమ్మెల్యే, స్పీకర్‌ను కలుపుకుంటే 107 అవుతుంది. కాగా బీజేపీకి మద్దతునిస్తానని చెప్పిన ఎమ్మెల్యే శంకర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదని తెలుస్తోంది. అదే జరిగితే బీజేపీ బలం 106కు పడిపోతుంది.