జాతీయ వార్తలు

జవాన్ల సేవ నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: దేశానికి జవాన్లు చేస్తున్న సేవ నిరుపమానమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. వారి ఆత్మాభిమానానికి ఎన్నడూ భంగం వాటిల్లనివ్వమని హామీ ఇచ్చారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ‘ఆపరేషన్ విజయ్’ (కార్గిల్ యుద్ధం) జరిగిన 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వెటరన్ జవాన్లతోపాటు, యుద్ధంలో మృతి చెందిన సైనికుల భార్యలు, కుటుంబీకులు కూడా హాజరైన ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పలు అంశాలను ప్రస్తావించారు. జనావన్ల గౌరవానికి, స్వాభిమానానికి భంగం కలిగించే ఎలాంటి ప్రయత్నాలనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ‘అది వ్యక్తిగత స్వాభిమానం కావచ్చు... లేదా జాతిని ఉద్దేశించిన స్వాభిమానం కావచ్చు... జవాన్ల గౌరవ మద్యాదలను విఘాతం కలగకుండా చూసుకుంటాం’ అన్నారు. 1999లో భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్‌కు మన జవాన్లు తగిన గుణపాఠం నేర్పించారని అన్నారు. వారి పోరాటాలు, త్యాగాలు, సేవా అనితర సాధ్యమని రాజ్‌నాథ్ కొనియాడారారు. మేజర్ జనరల్ గగన్ దీప్ బక్షీ మాట్లాడుతూ, దేశ రక్షణలో సిపాయిల పాత్రను వివరించారు. కార్గిల్ యుద్ధంలో భారత జవాన్లు చూపిన ధైర్య సాహసాలను కొనియాడారారు. కార్గిల్‌ను ఆక్రమించుకున్న పాకిస్తాన్‌ను తిరిమికొట్టి, భారత భూభాగాన్ని రక్షించే క్రమంలో ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టారని గుర్తుచేశారు. ఈ యుద్ధంలో మృతి చెందిన జవాన్లకు ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని అన్నారు. ఢిల్లీ కంటోనె్మంట్‌లోని ఎన్‌సీసీ ఆడిటోరియంలో వెటరన్స్ ఇండియా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన జవాన్ల భార్యలను సత్కరించారు.

చిత్రం...సమావేశానికి హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మేజర్ జనరల్ గగన్ దీప్ బక్షీ